Monday, April 29, 2024

వాజ్‌పేయీ పాలన దేశాభివృద్ధికి దోహదం: మోడీ

- Advertisement -
- Advertisement -

India developed with Vajpayee ruling

 

ఢిల్లీ: బలమైన, సుసంపన్నమైన భారత్ ను నిర్మించడానికి దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సేవలను స్మరించుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 96వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, బిజెపి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ముందుచూపుతో కూడిన వాజ్‌పేయీ పాలన దేశాభివృద్ధికి దోహదం చేసిందని ప్రశంసించారు. మోడీ ప్రభుత్వం డిసెంబర్ 25న సుపరపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అటల్ బిహార్ వాజ్‌పేయీ స్మారక సంపుటి పేరిటి పుస్తకాన్ని పార్లమెంట్ విడుదల చేయనున్నారు. ఇవాళ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయన సేవలను ప్రధాని గుర్తు చేశారు. ఆయన తన జీవితాన్ని సాంఘిక సంస్కరణలకే అంకితం చేశారని స్మరించుకున్నారు. ఆయన సేవలు భవిష్యత్ తరాలు గుర్తించుకోవడంతో పాటు పాటిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News