Sunday, April 28, 2024

తీహార్ జైలుకు కవిత

- Advertisement -
- Advertisement -

14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

ఇంటి భోజనం సహా పలు రకాల
వసతులకు అనుమతి
మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై
ఏప్రిల్ 1న విచారణ ఇది
మనీలాండరింగ్ కేసు కాదు..
పొలిటికల్ లాండరింగ్ కేసు
కడిగిన ముత్యంలా బయటికివస్తా
అప్రూవర్‌గా మారే ప్రసక్తే లేదు
కోర్టులో ఎంఎల్‌సి కవిత వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత ఇడి కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇడి తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్‌లైన్ లో వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉం దని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించా రు. ఈ క్రమంలోనే కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. మరోవైపు కవిత కుమారుడికి పరీక్షల షె డ్యూల్ విడుదల అయ్యిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టు కు తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆన్‌లైన్‌లో కోరారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు, కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఏప్రిల్ 9 వరకూ ఈ రిమాండ్ కొనసాగనుంది. దీంతో అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఇది లా ఉండగా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది. తనను కోర్టుకు తరలించే సమయంలో కవిత మాట్లాడారు.

ఈ కేసులో తాను కడిగిన ము త్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు’ అని వ్యాఖ్యానించారు. తనను తాత్కాలికంగా జైలులో పెట్టవచ్చునని, ఇంత మాత్రాన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరన్నారు. ఢి ల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక నిందితుడు బిజెపిలో చేరాడని, మరో నిందితుడికి బిజెపి టికెట్ ఇస్తోందన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు బాండ్ల రూపంలో ఆ పార్టీకి ఇచ్చారని కవిత ఆరోపించారు. తాను అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఇదొక తప్పుడు కేసు అని… తాను క్లీన్ గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కోర్టుకు వెళ్తున్న సమయంలో జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ ఆమె నినాదాలు చే శారు. రాజకీయ, వ్యాపారవేత్తల వరుస అరెస్టులు, విచారణల తో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఇడి వి చారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధ ముంద ని ఆరోపిస్తూ ఈ నెల 15న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను అరె స్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, 16న ఢిల్లీలోని పిఎంఎల్‌ఎ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపర్చింది.

అటు కవిత, ఇటు ఇడి తరఫున వాదనలు విన్న న్యాయ స్థానం, వా రం పాటు ఆమెను కస్టడీకి అనుమ తించింది. ఈ సమయంలో వివిధ అంశాలపై కవితను విచారించిన అధికారులు, లిక్కర్ కేసుకు సంబంధించి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. కస్టడీ గడువు గత శనివారంతో ముగియడంతో ఇడి అధికారులు, మ ళ్లీ ఆమెను అదే కోర్టులో ప్రవేశపెట్టి దర్యాప్తు చేయాల్సిన అం శాలు ఇంకా మిగిలి ఉన్నందున మరో ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజు లు కస్టడీకి ఇవ్వడానికి అంగీక రిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గడువు మంగళవారంతో ముగియడంతో కవితను మరోసా రి కోర్టు ముందు హాజరుపర్చారు. ఆన్ లైన్‌లో హాజరైన ఇడి తర ఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్, కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ నేపథ్యంలో కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరగా,14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధి ంచింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది.

ఇడి వాదన ఇదే…

కవితను మళ్లీ తమ కస్టడీకి అప్పగించాలని ఇడి అధికారులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ’కవిత సమాజంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావి తం చేసే అవకాశం ఉంది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీని వల్ల దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కవిత పాత్ర కు సం బంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ఆర్థిక నేరాల ద ర్యాప్తు చా లా కఠినమైనది. పథకం ప్రకారమే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. కవితను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలి.’ అని ఇడి కోర్టుకు వెల్లడించింది. అయితే, ఇప్పటికే రెండుసార్లు కవితను కస్టడీకి ఇచ్చామని.. మరోసారి కుదరదని కోర్టు స్ప ష్టం చేసింది. కవితకు ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది.

ఇంటి భోజనానికి అనుమతి…

కవితకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు రౌస్ అవె న్యూ కోర్టు అనుమతించింది. అలాగే, మంచం, పరుపు, బట్ట లు, చెప్పులు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు సైతం అంగీకరించింది. పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది. కవిత విజ్ఞప్తి మేర కు ఈ వెసులుబాట్లు ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు తగు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News