Monday, April 29, 2024

సోనియా గాంధీతో ఎంపి కోమటిరెడ్డి భేటీ..

- Advertisement -
- Advertisement -

Komati Reddy Venkat Reddy, Sonia Gandhi

 

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టిపిసిసి అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సమయంలో ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో
అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పదవి కోసం పార్టీలోని పలువురు సీనియర్లు చాపకింద నీరులా యత్నిస్తున్నారు. వారిలో ప్రధానంగా టి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, వి. హనుమంతరావు, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డితో పాటు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని సోనియాగాంధీ దృష్టికి కూడా తీసుకెళ్ళారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉత్తమ్‌పై పనితీరుపై అసంతృత్తితో ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లోనే జోరుగా వినిపిస్తోంది. పైగా కాంగ్రెస్ అధిష్టానం ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించలేకపోతున్నారన్న అపవాదు కూడా ఉత్తమ్‌పై ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ స్థానంలో కొత్త అధ్యక్షుడి అన్వేషణ చాలా రోజులుగా కసరత్తు సాగుతోంది.
ఇలాంటి తరుణంలో సోనియాను కోమటిరెడ్డి కలవడం కాంగ్రెస్ వర్గాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధానంగా వారిద్దరి మధ్య తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, కొత్త పిసిసి అధ్యక్షుని ఎంపికపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎంపి కోమటిరెడ్డి అభిప్రాయలను సోనియాగాంధీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై సోనియాకు ఆయన వివరించినట్లుగా సమాచారం. అయితే సోనియాతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలవడంతో పిసిసి అధ్యక్ష పదవి ఆయననే వరిస్తుందన్న ప్రచారం టి. కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా పిసిసి అధ్యక్ష పేరును ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

అవకాశమిస్త్తే….తన సమర్ధతను నిరూపించుకుంటా
కాంగ్రెస్ అధిష్టానం విశ్వసించి టిపిసిసి అధ్యక్ష పదవి తనకు కట్టబెడితే తప్పకుండా పార్టీ పూర్వవైభవం కోసం పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీలో నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగుజారుతోందని వ్యాఖ్యానించారు. ఇందులో కొందరు అగ్రనేతల పనితీరు కూడా సరిగ్గా లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు టిపిసిసి అధ్యక్ష పదవి లభిస్తే.. తన శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. అయితే పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… అందుకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకరావడంతో తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందన్నారు.

Komati Reddy Venkat Reddy meets Sonia Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News