Monday, April 29, 2024

ఎల్‌ఆర్‌ఎస్ గొప్ప అవకాశం

- Advertisement -
- Advertisement -

KTR launches LRS Scheme Meeseva Services

 

స్థలాల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ గొప్ప అవకాశం
పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం
ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
ప్రజా అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

 

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. ఇప్పటి వరకు అనధికారిక లేఅవుట్లలో తెలియక ఫ్లాట్ లను కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే ప్రభుత్వ స్థలాలకు, అర్భన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములకు, దేవాదాయ భూములకు, చెరువుల శిఖం భూములు లలో ఉన్న ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ వర్తించదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

సోమవారం ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ ఆన్‌లైన్, మీ సేవ సర్వీసులను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అలాగే ఎల్‌ఆర్‌ఎస్ సంబంధించిన అంశాలపై ప్రజా అవగాహన కోసం రూపొందించిన పోస్టర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఇదే మంచి అవకాశమన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ ద్వారా భూ యజమానులు పూర్తిస్థాయి హక్కులను పొందడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను పొందడానికి అర్హులవుతారని వివరించారు. వచ్చే అక్టోబర్ 15వ తేదీ వరకు గడువులోగా దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణ ఫీజును వచ్చే ఏడాది (2021) జనవరి 31వ తేదీ లోగా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు, వాటర్ వరక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

KTR launches LRS Scheme Meeseva Services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News