Monday, April 29, 2024

పెట్టుబడులు వాలే నేల

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి వాటిని సింగపూర్ కంపెనీలకు పరిచయం
చేయడంలో పూర్తి సహకారం అందిస్తాం : సింగపూర్ హై కమిషనర్ వాంగ్ హైదరాబాద్ 
విలక్షణ నగరం, ఇతర సిటీలకు భిన్నమైన కాస్మోపాలిటన్ స్వభావం గల విశిష్టపురం 
అనేక దేశాల కంపెనీలు, సిబ్బంది తెలంగాణలో పని చేస్తున్నారు, ఇక్కడ పెట్టుబడులకు ఇది అనువైన రాష్ట్రం: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని భారతదేశంలోని సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావుతో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను మంత్రి కెటిఆర్ సింగపూర్ హై కమిషర్‌కు వివరించారు. హైదరాబాద్ నగరం కొన్ని వందల సంవత్సరాల నుం చి దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మోపాలిటన్ స్వ భావంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నదన్న విషయాన్ని ఉదహారించారు. అలాగే అనేక రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు, వారి సిబ్బంది దీర్ఘకాలంగా తెలంగాణ లో పని చేస్తున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు, టిఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగిగామని ఈ సందర్భంగా హై కమిషనర్‌కు వివరించారు.

తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు పోటీ పడుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటి, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే అనేక సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన డిబిఎస్ వంటి కంపెనీలు, తమకు ఇక్కడ ఉన్న వాతావరణం గురించి సానుకూలంగా ఫీజ్‌బ్యాక్ అందించాయని హై కమిషనర్ మంత్రి కెటిఆర్‌కు తెలిపారు. సింగపూర్ కంపెనీలు ఐటి, ఇన్నోవేషన్, ఐటి అనుబంధ రంగాల్లో ఉన్న బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయని వాంగ్ తెలిపారు. హైదరాబాదులో ఉన్న టి హబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ఐటి ఇకో సిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించిన సానుకూలతలు తెలుసన్నారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాలు పట్ల ఆసక్తితో ఉన్నాయని తెలిపారు. సింగపూర్ కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణలో ప్రత్యేకంగా సింగపూర్ పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక జోన్ లేదా సింగపూర్ హబ్ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రతిపాదించారు.
కాగా మంత్రి ప్రతిపాదించిన సింగపూర్ పెట్టుబడులకు ప్రత్యేకంగా ఒక హబ్ ఏర్పాటు చేయడం ఒక గొప్ప ఆలోచన అని, గతంలో తాను వియత్నంలో పని చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం అక్కడ అనేక పెట్టుబడులను ఆకర్షించి, విజయవంతంగా కొనసాగుతున్నదని వాంగ్ వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. సమావేశానంతరం హై కమిషనర్ సిమోన్ వాంగ్‌తో పాటు చెన్నైలో సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్ కాక్ టియన్‌లను మంత్రి కెటిఆర్ శాలువాలతో సన్మానించారు.

KTR Meets Singapore High Commissioner

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News