Sunday, April 28, 2024

ఎర్ర సముద్రం రణక్షేత్రం..

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : యెమెన్ తిరుగుబాటుదార్ల ప్రాంతం నుంచి ప్రయోగించిన క్షిపణి ఢీకొనడంతో ఎర్రసముద్రంలో ఓ రవాణా నౌక దెబ్బతింది. భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ దాడి ఘటన శుక్రవారం జరిగిందని అమెరికా రక్షణాధికారులు, ఓ ప్రైవేటు ఇంటలిజెన్స్ సంస్థ తెలిపాయి. అల్ జస్రా నౌకపై యెమెన్ రెబెల్స్ జరిపిన తాజా దాడితో ఇప్పుడు రెడ్ సీలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరానీ మద్దతుతో ఉన్న హౌతీ రెబెల్స్ తాము ఈ దాడికి దిగినట్లు తెలిపారు. తాము ఈ చర్యకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు.

తరచూ రెడ్‌సీలో జరుగుతున్న రెబెల్స్ దాడులతో ఈ సముద్ర మార్గం మీదుగా, అత్యంత కీలక రవాణా మార్గం అయిన బాబ్ ఎల్ మంధేబ్ సింధుశాఖ ప్రాంతాల మీదుగా నౌకారవాణా అత్యంత సంక్లిష్టం అయింది. హమాస్‌పై ఇప్పుడు సాగుతోన్న ఇజ్రాయెల్ దాడులకు నిరసనగానే తాము ఈ దాడికి పాల్పడినట్లు రెబెల్స్ ప్రకటించారు. అయితే ఇంతవరకూ హౌతీ రెబెల్స్ నుంచి ఇప్పటి దాడి జరిగినట్లు పూర్తిస్థాయి ధృవీకరణ జరగలేదని కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. సింధుశాఖ మీదుగా వెళ్లుతున్న కంటైనర్ షిప్‌పై హౌతీ బలగాలు గురువారం శక్తివంతమైన క్షిపణితో దాడికి దిగాయి. అంతకు ముందు కూడా ఈ దాడులు జరుగుతూ వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News