Monday, April 29, 2024

సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. మే 3 తరువాత కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనసాగించాలని కోరారు. ప్రధానంగా దశల వారిగా లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చలు జరిగాయి. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచాలని, ఆర్థిక సాయం చేయాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. దశల వారిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తే బాగుంటుందని కేంద్రానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. ఇప్పటి వరకు ఇండియాలో 28062 కేసులు నమోదు కాగా 884 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1001 కాగా 25 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ 1177 మందికి సోకగా 31 మంది చనిపోయారు.

 

Modi video conference with all States CMs on corona,Prime Minister Narendra Modi holds video conference with the Chief Ministers of all States on COVID19 situation.Chief Minister of Karnataka BS Yediyurappa attends video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi, on COVID19 situation.Tamil Nadu CM Edappadi K. Palaniswami attends video conference meeting of Chief Ministers with Prime Minister Narendra Modi, on COVID19 situation.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News