Monday, April 29, 2024

50 ఏళ్లు దాటిన పోలీసులకు నో డ్యూటీ

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉండడంతో ముంబయి వాసులు గజ గజ వణికిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 150 మంది పోలీసులకు సోకగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. దీంతో 50 ఏళ్లు పైబడిన పోలీసులు వీధుల్లోకి రావొద్దని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారు డ్యూటీకి రావొద్దని సూచించింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 8590కి చేరుకోగా 369 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ముంబయిలోనే 5776 మందికి కరోనా వైరస్ సోకింది. భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 29673 మంది చేరుకోగా 940 మంది చనిపోయారు. తెలంగాణలో 1003, ఎపిలో 1259 మందికి కరోనా కేసులున్నాయి. ప్రపంచంలో కరోనా బాధితులు సంఖ్య 30.65 లక్షలకు చేరుకోగా 2.11 లక్షల మంది చనిపోయారు.

రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు
కరోనా బాధితులు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర 8,590 1,282 369
గుజరాత్
3,548 394 162
ఢిల్లీ
3,108 877 54
రాజస్థాన్
2,335 744 51
మధ్య ప్రదేశ్
2,165 357 110
ఉత్తర ప్రదేశ్
1,986 399 31
తమిళనాడు 1,937 1,101 24
ఆంధ్రప్రదేశ్ 1,259 258 31
తెలంగాణ 1,003 332 25
పశ్చిమ బెంగాల్ 697 109 20
జమ్ము కశ్మీర్
546 164 7
కర్నాటక
520 198 20
కేరళ 482 355 4
బిహార్
346 57 2
పంజాబ్
330 98 19
హర్యానా
304 218 3
ఒడిశా
118 37 1
ఝార్ఖండ్ 103 17 3
ఉత్తరాఖండ్ 51 33
ఛండీగఢ్
45 17
హిమాచల్ ప్రదేశ్ 40 25 2
అస్సాం 37 27 1
ఛత్తీస్ గఢ్
37 34
అండమాన్ నికోబార్ దీవులు 33 15
లడఖ్ 20 16
మేఘాలయ 12 1
పుదుచ్చేరీ 8 5
గోవా 7 7
మణిపూర్ 2 2
త్రిపుర 2 2
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరం 1
మొత్తం
29,673 7,181 940

 

No duty above 50 Years police in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News