Sunday, April 28, 2024

ఉత్తర కొరియా యురేనియం శుద్ధిప్లాంట్ విస్తరణ

- Advertisement -
- Advertisement -
North Korea uranium enrichment plant expansion
శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడి : నిపుణుల నివేదిక

సియోల్ : ఉత్తర కొరియా తన యాంగ్‌బియాన్ న్యూక్లియర్ కాంప్లెక్సులో అణుశుద్ధి కర్మాగారాన్ని విస్తరిస్తున్నట్టు ఇటీవల వెలువడిన శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయని , అణుబాంబుల ముడి సరకుల ఉత్పత్తిని పెంపొందించాలన్న ఆకాంక్షకు ఇది సంకేతమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికాతో నిరాయుధీకరణ దౌత్యం నెరపి ఆరు మాసాలైన నేపథ్యంలో ఉత్తర కొరియా ఇటీవల మొదటి క్షిపణి పరీక్షలు నిర్వహించడం ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ సందర్భంగా దీనిపై ఈ విధమైన సమీక్ష వెలువడింది.

యాంగ్‌బియాన్ కాంప్లెక్సులో క్షిఫణి స్థాయి యురేనియం ఉత్పత్తిని 35 శాతం వరకు పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నానికి ఇది సంకేతంగా తెలుస్తోందని మోంటెరీ వద్ద ఉన్న మిడిల్‌బరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ కు చెందిన జెఫ్రీ లూయిస్, మరో ఇద్దరు నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. యాంగ్‌బియాన్ న్యూక్లియర్ కాంప్లెక్సులో అదనంగా వెయ్యి చదరపు మీటర్ల పరిధిలో అదనంగా వెయ్యి ఉపకేంద్ర యంత్రాలను అమర్చడానికి నిర్మాణాలు జరుగుతున్నాయని దీనికోసం చెట్లను తొలగించి నేలను చదును చేస్తున్నారని సెప్టెంబర్ 1,14 తేదీల్లో వెలువడిన శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News