Monday, April 29, 2024

పల్లె ముల్లె

- Advertisement -
- Advertisement -

Budget

 

మన ఊరు… మన రైతు
సాగు సంక్షేమాలకు అగ్రతర ప్రాధాన్యం
రూ.1,82,914.42 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
ఈ నెలలోనే రూ.25వేల లోపు పంటరుణాల మాఫీ
రూ.1,198కోట్ల విడుదలకు నిర్ణయం
5,83,916 మంది రైతులకు లబ్ధి
పంచాయతీరాజ్
రూ. 23,005 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధికి
రూ. 10వేల కోట్లు : మంత్రి కెటిఆర్ హర్షం
అప్పుల ద్వారా సమీకరించనున్న విత్తం: రూ.35,500కోట్లు
గత బడ్జెట్ కంటే కొత్త బడ్జెట్ పెట్టుబడి రూ.36,209 కోట్లు అధికం
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.25,811 కోట్లు
రైతుబంధుకు అదనంగా 2వేల కోట్లతో రూ.14వేల కోట్లు
రైతు రుణమాఫీకి రూ.6,225కోట్లు, రైతు బీమాకు రూ.1141కోట్లు
సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి లక్షమందికి : రూ.11,917కోట్లు
కేంద్రం నుంచి తగ్గిన పన్ను రాబడి వాటా, జిఎస్‌టి : రూ.32,000కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు
ఎస్‌సిల ప్రత్యేక ప్రగతి నిధి : రూ. 16,534.97 కోట్లు
ఎస్‌టిల ప్రత్యేక ప్రగతి నిధి : రూ. 9,771.27 కోట్లు
మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం : రూ. 1,518.06 కోట్లు
ఫీజు రియింబర్స్‌మెంట్ : రూ. 2,650 కోట్లు.
పాఠశాల విద్యాశాఖ : రూ. 10,421 కోట్లు.
ఉన్నత విద్యాశాఖ : రూ. 1,723.27 కోట్లు.
సంపూర్ణ అక్షరాస్యత : రూ. 100 కోట్లు.

2020-21 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి సమతుల్యతతో ఉంది. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్. అన్ని వర్గాల సంక్షేమం- అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయి. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయం.
                                                                                                    – ముఖ్యమంత్రి కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి పట్ల ఎంతటి నిబద్ధతతో ఉందో ఈ బడ్జెట్ దాటి చెబుతోంది. పూర్తిగా ప్రజలే కేంద్రంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్ ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహా కవి దాశరథి నినదిస్తే, నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలని సిఎం కెసిఆర్ స్వప్నించారు. ఈ కల నెరవేరేందుకు అహరహం పరిశ్రమిస్తున్నారు. అందులో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి ఫలితాలు త్వరలోనే చూస్తాం. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొంత మెరుగ్గానే ఉంది. ఈ బడ్జెట్‌ను కేవలం వార్షిక బడ్జెట్ అన్న దృక్ఫథంతో కాకుండా, వచ్చే నాలుగేళ్ల రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక అభివృద్ధి ప్రణాళికగా రూపొందించాం.
                                                                               – బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి హారీశ్‌రావు

202021 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914.42 కోట్ల పెట్టుబడితో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం నాడు శాసనసభకు సమర్పించారు. శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్ ప్రధానంగా గ్రామీణ రంగానికి, సంక్షేమానికి విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.25,811 కోట్లు, పంచాయతీ రాజ్ రూ. 23,005 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ. 11,758 కోట్లు, ఎస్‌సిల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 16,534.97 కోట్లు, ఎస్‌టిల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 9,771.27 కోట్లు, మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి రూ. 1,518.06 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి రూ.

10వేల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కంటే కొత్త బడ్జెట్ పెట్టుబడి రూ.36,209 కోట్లు అధికం. అప్పుల ద్వారా రూ.35,500కోట్లు సమీకరించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్ను ఆదాయంలో భారీ కోత ఉన్నప్పటికీ, ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ పేద ప్రజల సంక్షేమ వికాసాలకు, రైతు బాగుకు తగిన కేటాయింపులు చేస్తూ ప్రగతి శీల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రూపొందించింది. ప్రధానంగా 5,83,916 మంది రైతులకు లబ్ధి కలిగిస్తూ ఈ నెలాఖరులోగానే రూ.25వేల లోపు పంటరుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.1,198కోట్లు విడుదల చేయదలిచారు.

Priority for cultivation and welfare in Budget
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News