Sunday, April 28, 2024

చెన్నైపై బెంగళూరు ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నైపై బెంగళూరు ఘన విజయం

చెలరేగిన కోహ్లీ.. రాణించిన బౌలర్లు

RCB Win by 37 Runs against CSK

దుబాయి: ఐపిఎల్‌లో చెన్నైకి మరో ఓటమి ఎదురైంది. రాయల్ చాలెంజ్ బెంగళూరుపై 170 పరుగుల లక్ష ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. దీంతో 37 పరుగులతో బెంగళూరు విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత పది వికెట్లు తేడాతో విజయం సాధించిన ఆ జట్లు మరోసారి ఓటమి పాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విజృంభణతో 4 వికెట్ల నష్టానికి 169 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన చెన్నై జట్టు ఏ దశలోను ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. ధోనీ, బ్రావో, జడేజా ఇలా స్టార్‌బ్యాట్స్‌మన్ అందరూ కన్సీం రెండంకెల స్కోరు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారంటే బెంగళూరు బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌల్ చేశారో అర్థమవుతుంది. అంబటి రాయుడు (42), జగదీశన్ (33) కొంతమేరకు పోరాడినా వారుఔటయిన తర్వాత మిగతా వారంతా చేతులెత్తేశారు. కోహ్లీ సేన 8 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు ఆశలు నిలుపుకొంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ తొలుత చప్పగా సాగింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో బెంగళూరు బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే అర్ధ శతకం పూర్తి చేసిన తర్వాత కోహ్లీ, శివం దూబేతో కలిసి చెలరేగి పోయాడు. ఈ ఇద్దరూ చివరి మూడు ఓవర్లలో 52 పరుగులు రాబట్టడంతో బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కోహ్లీ 52 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేసి నాటవుట్‌గా నిలవగా, దూబే 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. వీరికి తోడు పడిక్కల్ 34 బంతుల్లో 33 పరుగులతో రాణించాడు.

RCB Win by 37 Runs against CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News