Sunday, April 28, 2024

మాకు కొవాగ్జిన్ టీకా వద్దు

- Advertisement -
- Advertisement -

RML Doctors are worried about covaxin vaccine

 

ఢిల్లీ ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్ల లేఖ

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై ఢిల్ల్లీకి చెందిన వైద్యులు అందోళన వ్యక్తం చేశారు. సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా వైపే వారు మొగ్గు చూపుతున్నారు. తమకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కొవిషీల్డ్ టీకానే వేయాలని ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆస్పత్రికి చెందిన రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. కొవాగ్జిన్ టీకా వేస్తామంటే ఎంతమాత్రం ముందుకు రాబోమని స్పష్ట చేశారు. ఈ మేరకు వారు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఒక లేఖ రాశారు. ‘ మా ఆస్పత్రిలో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కంటే భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొవాగ్జిన్ ట్రయల్స్ పూర్తి కాకపోవడంపై రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ టీకా వేయించుకునేందుకు చాలా మంది వైద్యులు ముందుకు రాకపోవచ్చు. తద్వారావ్యాక్సినేషన్ లక్షం నెరవేరక పోవచ్చున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకు రాదలిచాం. ఈ నేపథ్యంలో అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకున్న కొవిషీల్డ్ టీకాను మాత్రమే మాకు వేయాలని కోరుతున్నాం’ అని మొడికల్ సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News