Monday, April 29, 2024

ట్రంప్ లాయర్‌కు కరోనా..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: తమ వ్యక్తిగత లాయర్ రూఢీ గియులియానికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని ఇక దిగిపోవల్సిన అమెరికా ఆధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇటీవలి పరీక్షలలో ఆయనకు కొవిడ్ వచ్చినట్లు నిర్థారణ అయిందని వెల్లడించారు. అమెరికా ప్రెసిడెంట్ ఆంతరంగిక అధికారిక బృందంలో ఇప్పటికే పలువురికి కరోనా సోకింది. ఈ జాబితాలో ఇప్పుడు 76 ఏండ్ల రూఢీ కూడా చేరారు. ఆయనను వాషింగ్టన్‌లోని మెడ్‌స్టర్ జార్జిటౌన్ యూనివర్శిటీకి వెంటనే తరలించారు. న్యూయార్క్ మాజీ మేయర్ కూడా అయిన రూఢీ ఇతరులకు వైరస్ సోకడం వల్ల ట్రంప్ అధికార బృందం వైరస్ నియంత్రణ పట్ల ఎంతటి నిర్లక్షం వహించిందనేది స్పష్టం అయిందని విమర్శలు తలెత్తాయి.

Rudy Giuliani tests positive for Corona says Trump

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News