Monday, April 29, 2024

కరోనా నుంచి కోలుకున్న తగ్గని సైడ్‌ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

Side effects in patients recovering from corona

హైదరాబాద్: నగర ప్రజలు గత ఏడు నెలల నుంచి కరోనా వైరస్‌తో పోరాటం చేసి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో బయటపడ్డారు. వైరస్ ముప్పు తప్పిందని భావించిన కొంతమంది రోగులకు సైడ్‌ఎఫెక్ట్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కొత్తగా వచ్చే రోగాలతో ఆసుపత్రుల చుట్టు తిరుగుతూ లక్ష రూపాయలు ఖర్చు చేసి పరిస్దితి ఏర్పడిందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కరోనాతో ఆసుప్రతులకు వెళ్లితే, గత వారం రోజుల నుంచి ఇతర వ్యాధులకు సంబంధించిన రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా సోకి వ్యక్తులకు మూడు నెలల వరకు కొన్ని సమస్యలుంటాయని, కానీ కొందరికి ఊహించిన విధంగా వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయని చెబుతున్నారు.

కోలుకున్న వారికి ఆలసట, ఒంటినొప్పలు, కీళ్లనొప్పలు, ఏకాగ్రత లేకపోవడం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు లంగ్ ఫైబ్రోసిస్, పల్మనరీ ఫైబ్రోసిన్ స్కార్లు ఏర్పడటంతో పాటు ఊపిరితిత్తుల సాగతీతగుణంను కోల్పోయి అక్సిజన్ పంప్ చేసే సామర్దాన్ని కోల్పోతున్నారు. మరోవైపు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమయ్యే ఇస్కీమిక్ గుండె వ్యాధి, మెదడులో రక్తం గడ్డకట్టడంతో వచ్చే స్ట్రోకు, మూత్ర పిండాల సమస్య వంటి శరీర అవయవాలకు ఇబ్బందులను కలిగించే ఆరోగ్య సమస్యలు కూడ ఎదురైతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. చాలామంది రోగులు కరోనా బారిన పడకముందు వారిలో అలాంటి సమస్యలు లేవని చెబుతున్నారు. మరి కొంతమంది ఇప్పటికే జీవితాంతం ప్రభావం చూపించే కోలుకులేని పరిస్దితులోకి వెళ్లినట్లు, అన్ని వయస్సుల వారిలోనూ ఈదోరణి కనిపిస్తుందని, ఒకే సమయంలో ఒకటి అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మళ్లీ కరోనా బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు గ్రేటర్ 10.40లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా 1.20లక్షల పాజటివ్ కేసులు నమోదైనట్లు, అందులో 1100మంది మృత్యువాత పడట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నారు.వీరిలో 65వేల మంది 25నుంచి 40సంవత్సరాల వయస్సులోపు వారేనని,వీరు వైరస్‌నుంచి కోలుకున్నతరువాత కండరాల నొప్పులు,కీళ్లనొప్పలు,ఆలసట రావడంతో మరోసారి చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు.కరోనా నుంచి బయటపడిన వారు ఆరునెలల పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే ఇతర వ్యాధులు దరి చేరని, గత 15రోజుల నుంచి నగరంలో వర్షాలు కురువడంతో వాతావరణ మార్పులతో ఇతర వ్యాధులు వస్తున్నట్లు, త్వరలో వచ్చేది చలికాలం కావడంతో కొత్త రోగాలు పుట్టుకొస్తాయని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. వైరస్ బారిన పడిన వారు వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News