Sunday, April 28, 2024

పేదల ఆత్మగౌరవం ‘డబుల్’

- Advertisement -
- Advertisement -

Soon another housing colony will open in Hayathnagar

 

త్వరలో హయత్‌నగర్‌లో మరో హౌసింగ్ కాలనీ ప్రారంభం
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్దిదారులు
ప్రారంభానికి సిద్ధమైన కొల్లూర్, రాంపల్లి హౌసింగ్ కాలనీలు
పలు చోట్ల ఊపందుకున్న నిర్మాణ పనులు
నాణ్యతతో పనులు, పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక
అంచనా వ్యయాలు పెరుగుతున్నా తగ్గని నిర్మాణాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : మనిషి మనుగడ సాగించాలంటే కావల్సిన రోటీ, కపడా, మకాన్. ఈ మూడింటి లో ఏది లేకపోయినా మనిషి బతుకు దుర్భరమే. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నిలువ నీడ లేని పేదలు కూడా ఆత్మగౌరవంతో జీవించేందుకు వీలుగా పైసా ఆర్థిక భారం లేకుండా ఉచితంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తోం ది. దేశానికి స్వాతంత్రం సిద్దించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోని సంచలనాత్మక నిర్ణ యం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. గతంలో పాలకులు లబ్దిదారుడి వాటా తీసుకుని, మిగిలిన ఖర్చును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుని ఇళ్లను నిర్మించేవారు.

ఇళ్లు పూర్తయిన తర్వాత మౌలిక సదుపాయాలం టూ ఖర్చు తడిసిమొపడయ్యేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుడి నుంచి పైసా తీసుకోకుండా ఈ ఇళ్లను నిర్మించి ఇస్తోంది. హైదరాబాద్‌వంటి మహానగరంలోని ముఖ్య ప్రాంతాల్లో సర్కా రు నిర్మించి ఇస్తున్న ఇళ్లు మార్కెట్ విలువ ప్రకారం సుమారు 80 నుంచి కోటి రూపాయల వరకు కూడా ఉంటుంది. దీంతో గుడిసెల్లో నివాసముండే పేదలకు కోటి రూపాయల స్థిరాస్తి సమకూరుతోంది. దేశంలోనే మొట్టమొదటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీని రాజధానిలోని సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించారు. అప్పట్లో ఈ కాలనీని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శన కోసం తండోపతండాలుగా వచ్చారు. శివారు పటాన్‌చెరు సమీపంలోని కొల్లూర్‌లో ఒకే చోట నిర్మిస్తున్న 17 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీకి ఇటీవలే ‘హడ్కో’ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

గత పాలకులు కూడా వాంబే, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, ఇందిర మ్మ, రాజీవ్ గృహకల్ప వంటి స్కీమ్‌లతో పేదలకు పక్కా ఇళ్ల ను నిర్మించి ఇచ్చినా, అవి పిచ్చుక గూళ్లను తలపించేలా, అరకొర వసతులతో నిర్మించటంతో అసంతృప్తి చెందిన లబ్దిదారు లు అందులో నివసించేందుకు ముందుకు రాలేదు. అంతేగాక, నిర్మాణ వ్యయంలోనూ లబ్దిదారుడి వాటాగా బ్యాంకులను అనుసంధానం చేసి రుణాలు ఇప్పించారు. ఇది ఒక రకంగా పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారమే. ముఖ్యంగా ఈ రకంగా రాజధాని నగరంలో శివార్లలో, ఇతర జిల్లాల్లో నిర్మించిన ఈరకమైన ఇళ్లను లబ్దిదారులు తీసుకోకపోవటంతో ప్రస్తు తం వేల సంఖ్యలో ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఇళ్ల కిటికిలు, తలుపులు దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇలాంటి భవనాలు దెయ్యాల బంగ్లాలుగా దర్శనమిస్తున్నాయి. ఏ మాత్రం ముందు చూపు లేకుండా హడావుడి చేసి వేల సంఖ్యలో ఈ ఇళ్లను నిర్మించి ప్రజాధనం, ప్రభుత్వ నిధులను వృధాగా వెచ్చించినట్లు విమర్శలున్నాయి. పైగా ఇళ్ల నిర్మాణానికి ఓ అంచన, అవి పూర్తయిన తర్వాత మౌలిక వసతులకు మరో అంచనాలు వేసేవారు. చాలా ప్రాంతాల్లో పక్కా ఇళ్లను నిర్మించిన వాటికి కనీసం అప్రోచ్ రోడ్లు కూడా లేకపోవటం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనం. అంతేగాక, లబ్దిదారుల ఎంపిక కూడా అయోమయం, గందరగోళంగా ఉండేది.

ముఖ్యంగా నగరాలు, పల్లెలోని పేదలు స్థానికంగా అందుబాటులో ఉన్న వృత్తులు, చిన్న చిన్న వ్యాపారాలు, ప్రైవే టు ఉద్యోగాలు చేసుకుంటూ నివసిస్తుంటారు. అలాంటి వారికి ఎక్కడో ముప్పై, నలభై కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్యమైన ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇస్తే వారి బతుకుదెరువు ప్రశ్నార్థకమవుతుందన్న భయంతో చాలా మంది ఈ ఇళ్లలో నివసించేందుకు నిరాకరించా రు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అరకోర వసతలతో అల్లాడుతున్న మురికివాడలను గుర్తించి, అక్కడున్న కుటుంబాలకు అక్కడే పక్కా ఇళ్లను నిర్మించటంతో పాటు, అందులో నివాసముండే కుటుంబానికి సరిపోయేలా ఇళ్లను నిర్మించి ఇవ్వటంతో తమ ఆత్మగౌరవం డబుల్ అయ్యిందని కొందరు లబ్దిదారులు వ్యాఖ్యానించారు. ఇటీవలే రాజధానిలోని సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్‌పల్లి, గోషామహల్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించారు. రాజధానిలోని బన్సీలాల్ పేట, భోజగుట్ట, సైదాబాద్ తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

ప్రభుత్వం ఇటీవల మరో రూ.600 కోట్లను మంజూరు చేయటంతో పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలోనే రూ.8 వేల కోట్లను వెచ్చించి దాదాపు లక్షా పదివేల ఇళ్లను నిర్మిస్తున్నారు. వీటిలో సగానికి పైగా ఇళ్ల నిర్మాణ పనులు దాదాపు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. ఒక్క కొల్లూర్ ప్రాంతంలోనే 17 వేల ఇళ్లను నిర్మించే పనులు లబ్దిదారులకు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లిలో కూడా ఐదువేల ఇళ్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. శివారులోని హయత్‌నగర్‌లో కూడా రేపో మాపో రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా 372 ఇళ్లను లబ్దిదారులకు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎంతో పారదర్శకత

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లోనే గాక, లబ్దిదారుల ఎంపికలోనూ ఎంతో పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఓ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన నాటి నుంచి పూర్తయ్యే వరకు పనులను స్థానికులు ప్రతి రోజు గమనించేలా అనుమతిస్తున్నారు. దీంతో పనుల్లో ఎక్క డా కూడా లోపాలు జరిగే అవకాశాల్లేవు. దీనికి తోడు లబ్దిదారులు రొజూ పనులను గమనించేందుకు రావటం, పూర్తయిన తర్వాత వారే అక్కడ నివాసముంటున్నందున కొత్త లబ్దిదారులను అందులో చేర్చే అవకాశాలు కూడా చాలా తక్కువేనని చెప్పవచ్చు. లబ్దిదారుల మధ్య బహిరంగంగా డ్రా నిర్వహించి ఇళ్లను కేటాయిస్తున్నందున కనీసం గ్రౌడ్ ఫ్లొర్, ఫస్ట్, సెకండ్ ఫ్లొర్‌లలో ఇళ్లను కేటాయించుకునే పైరవీలు చేసుకునేందుకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఇళ్లు నిర్మించటం ఒక ఎత్తై తే వాటి కేటాయింపు పారదర్శకంగా జరపటం మామూలు విషయమేమీ కాదన్న వాదనలున్నాయి.

నిర్మాణ వ్యయ వివరాలు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధు ల్లోని పట్టణ, గ్రామ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యయం పెరుగుతున్నా, నిర్మాణానికి ప్రభుత్వం ఏ మాత్రం వెకంజా వేయటం లేదు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినపుడున్న అంచన వ్యయ వివరాలిలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షల నాలుగు వేలు ఖర్చవుతుండ గా, మౌలిక వసతుల కోసం మరో రూ.లక్షా 25 వేలు వెచ్చిస్తూ ఒక్కో ఇంటికి రూ.6 లక్షల 29 వేల వరకు సర్కారు ఖర్చు చేస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల 30 వేలు, మౌలిక వసతుల కోసం వెచ్చిస్తున్న మరో రూ.75వేలతో కలిపి ఒక్కో ఇంటికి రూ. 6 లక్షల 5 వేలు ఖర్చు చేస్తున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో గ్రౌండ్ నుంచి మూడు ఫ్లోర్‌ల వరకు ఒక్కో ఇంటికి రూ.7 లక్షలు కాగా, కనీస వసతుల కోసం అదనంగా రూ.75 వేల తో కలిపి ఒక్కో ఇంటికి రూ.7.75 లక్షలు వెచ్చిస్తోం ది. జిహెచ్‌ఎంసి పరిధిలోనే సెల్లార్, సిల్టుతో తొమ్మిది అంతస్తులుగా నిర్మించే ఒక్కో ఇంటికి కనీస వసతులతో కలిపి రూ.8.65 లక్ష లు వెచ్చిస్తుండగా, అందులో కనీస వసతుల కోసం రూ.75 వేలు ఖర్చు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News