Monday, April 29, 2024

అసెంబ్లీ సమావేశాల కుదింపుపై నేడు కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

బిఎసి భేటీ అనంతరం ప్రకటన చేయనున్న స్పీకర్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల గడువు తగ్గింపునకు అధికార, విపక్షాల మొగ్గు

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలకుదింపుపై మంగళవారం స్పీకర్ పోచారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నేడు బిఎసి సమావేశం ఏర్పాటు చేసి స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించనున్నారు. మంగళవారం శానససభస్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఛాంబర్‌లో అధికార, విపక్షాలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌నుంచి భట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బర్ ఉద్దీన్ ఒవైసి, అధికార టిఆర్‌ఎస్ పార్టీ నుంచి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి స్పీకర్ పోచారంతో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో సమావేశాలను కుదించాలని స్పీకర్‌కు వారు సూచించారు. స్పీకర్ పోచారం అధికార, విపక్షాల సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుని బుధవారం బిఎసిలో చర్చిం చి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 28 వరకు 18 పనిదినాలు నిర్వహించాలని శాసనసభ బిఎసిలో నిర్ణయించారు. అవసరమైతే పనిదినాలను పెంచేందుకు అభ్యంతరం లేద ని స్పీకర్ పోచారం మొదట స్పష్టం చేశారు. కరోనా సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. రెండు పర్యాయాలు శాసనసభ, మండలి సభ్యులతో పాటు రిపోర్టర్లు, అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగటివ్ ఉన్నవారినే సభకు అనుమతించారు. అయితే 6వ తేదీన మంత్రి హరీష్‌రావుకు కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆయన సభకు రాలేదు. నెగటివ్ రిపోర్టు వచ్చిన అనంతరం సభకు వచ్చారు. రెండవ విడత కరోనా పరీక్షల్లో ఎంఐఎం శాసన సభ్యుడు జాఫర్ హుస్సేన్‌తో పాటు అసెంబ్లీ విధుల్లో ఉన్న 52 మందికి కరోనా సోకి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.

ఇందులో 5గురు రిపోర్టర్లు కూడా ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా విస్తరిస్తుండటంతో శాసనసభ వర్షాకాల సమావేశాలపై బిఎసిలో చర్చించి కుదిం పు పై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ యోచిస్తున్నారు. ఇప్పటివరకు శాసనసభ, మండలిలో తొమ్మిది బిల్లులు అమోదం పొందాయి. కేంద్రం ప్రవేశపెట్టనున్న నూతన విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం కూడా చేశారు. ప్రభుత్వ బిల్లులకు కూడా ఆమోదం లభించిన నేపథ్యంలో సమావేశాలను వాయిదా వేసే అవకాశాలున్నా యి. వర్షాకాల సమావేశాలు మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, పాండిచ్చే రి నిర్వహించినప్పటికీ సగటున 4రోజులు మాత్రమే నిర్వహించాయి. పాండిచ్ఛేరి శాసన సభ సమావేశం కేవలం ఒక రోజు నిర్వహించి కరో నా నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బుధవారంతో రాష్ట్ర శాసన సభ సమావేశాలు వాయిదా పడినా ఎనిమిది రోజులు సమావేశాలను నిర్వహించిన ఘనత తెలంగాణకే దక్కుతుంది.

Speaker to decision on TS Assembly session compression

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News