Friday, May 17, 2024

టిఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Telangana Eamcet Result 2020

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ లో 75.29శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ పరీక్షకు లక్షా 43,వేల 326 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… పరీక్షకు లక్షా 19వేల 183 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 89,734 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకూడదన్న సిఎం కెసిఆర్ సూచనతో అన్ని రకాల చర్యల మధ్య సెట్ లను నిర్వహించామని మంత్రి సబితా ఇంద్రరెడ్డి తెలిపారు. ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంకు సాయితేజ, రెండవ ర్యాంకు యశ్వంత్ సాయి, మూడో ర్యాంకు మణి వెంకటకృష్ణ మొదటి మూడు ర్యాంకులను సాధించారు. ఈ సారి టాప్ ర్యాంకుల్లో బాలురు సత్తాచాటారు. మొదటి పది ర్యాంకులను బాలురు కైవసం చేసుకున్నారు. ఈ నెల 9 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు… 22న తొలిదశ సీట్ల కేటాయింపు జరగనుంది. 29నుంచి చివరి దశ కౌన్సెలింగ్ జరగనుంది.

ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి1
ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి2

Telangana Eamcet Results 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News