Thursday, May 9, 2024

రైతులపై బిజెపికి ప్రేమ ఉంటే… పసుపు బోర్డు తీసుకరావాలి: నిరంజన్

- Advertisement -
- Advertisement -

Niranjan reddy

 

హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బిజెపి నేతల దీక్షలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలా కొనుగోళ్లు జరగడంలేదని విమర్శలు గుప్పించారు. బిజెపి నేతలకు రైతులపట్ల ప్రేమ ఉంటే కేంద్రంతో పోరాడి పసుపు బోర్డు సాధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు 7077 ధాన్యం, 1027 మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఇచ్చామని, ప్రస్తుతం 5187 ధాన్యం, 923 మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, పంటల కోతను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచుతామని, పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలకు రైతుబీమా చెక్కులు అందజేశామని, సిఎ కెసిఆర్ ఆరేళ్లలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఉన్న గోదాముల నిల్వ సామర్థ్యాన్ని 25 లక్షల టన్నులకు పెంచారని, తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యల విషయంలో పూర్తి అవగాహనతో ఉందన్నారు.

Telangana people want turmeric board from central
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News