Sunday, April 28, 2024

ఆన్‌లైన్‌లో బోనాల సమర్పణ..

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్‌లో బోనాల సమర్పణ
రాష్ట్రంలో ఎక్కడినుంచైనా బుక్ చేసుకునే సదుపాయం
దేవాదాయ, తపాలా శాఖలు సంయుక్తంగా….
ముందుగా ఉజ్జయిని మహంకాళి బోనాలకు అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సమయంలో బోనాల సందర్భంగా ఆలయానికి వెళ్లలేని వారి కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆన్‌లైన్‌లో బోనాలను సమర్పించేలా సదుపాయం కల్పించింది. దీంతోపాటు అమ్మవార్ల ప్రసాదాన్ని ఇంటికి పోస్టులో పంపించేలా ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ సేవల్లో భాగంగా పలు కార్యక్రమాలకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ బోనాలను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంతో పాటు గోత్రనామాలతో పూజలు చేసిన ప్రసాదాన్ని భక్తులకు పంపించనుంది.
ఈ ఏడాది లష్కర్ బోనాలతో
బోనాల జాతర కోసం నగరంలోని అమ్మవారి దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో బోనాల సందడి షురూ అయ్యింది. కరోనా ప్రభావంతో భక్తులు ప్రత్యక్షంగా బోనాలు సమర్పించే పరిస్థితులు కన్పించడం లేదు. అందుకే మహంకాళి ఆలయ నిర్వాహకులు ఆన్‌లైన్ బోనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే నిర్వాహకులే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఈ ఏడాది లష్కర్ బోనాలతో ఈ ప్రయోగానికి దేవాదాయ, తపాలా శాఖలు సంయుక్తంగా శ్రీకారం చుట్టడం విశేషం.
అమ్మవారి ప్రసాదం, డ్రైఫ్రూట్స్‌ను పోస్టు ద్వారా
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ బోనాలను బుక్ చేసుకునే సదుపాయం దేవదాయ శాఖ కల్పించింది. ఆన్‌లైన్ బోనాలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ప్రసాదం, డ్రైఫ్రూట్స్‌ను పోస్టు ద్వారా నేరుగా భక్తుల ఇంటికి పంపిస్తారు. దీనికి సుమారు 150 రూపాయల వరకు ఖర్చు కానుంది. తపాల ఛార్జీలు దీనికి అదనంగా ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులు తమ కానుకలను గతంలో అమ్మవారి హుండీలోనే వేసేవారు. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా వేయవచ్చని అందుకోసం ఈ-హుండీని దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు ఎక్కడి నుంచైనా క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు సమర్పించవచ్చు. దీనికోసం యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ujjayinimahamkali.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, పూజలు, అభిషేకాలు బుక్ చేసుకోవచ్చని దేవాదాయ శాఖ పేర్కొంది.

TS Endowments department Set up for Online Bonalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News