Monday, April 29, 2024

కొవిడ్ మృతుల పరిహారంపై మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

TS Govt to release Rs 50K Ex-gratia for Covid deaths

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ మృతులకు పరిహారం చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి రాహుల్ బొజ్జా కొవిడ్ మృతుల పరిహారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కొవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు రూ.50 వేల పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లోపే పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం మృతుల కుటుంబ సభ్యులు .. ప్రభుత్వం పేర్కొన్న అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి జిల్లా కలెక్టర్ పరిహారం మంజూరు చేయనున్నారు. ఈ మొత్తం ఆధార్ లింక్ అయిన ఖాతాకు నేరుగా బదిలీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News