Thursday, May 9, 2024

దొరలం మేం.. దొంగలు వారు: ట్రంప్

- Advertisement -
- Advertisement -

Twitter and Facebook flag Trump message claiming

న్యూయార్క్: ఎన్నికల ఫలితాల దశలో ట్రంప్ ఘాటైన ట్వీట్‌కు ట్విట్టర్ నిర్వాహకులు షాకిచ్చారు. ట్వీటును తొలుత వెలువరించిన ట్విట్టర్ తరువాతి క్రమంలో ఘాటైన హెచ్చరిక వెలువరించి, దీనిని బ్లాక్ చేసింది. దేశంలో తాము ఇప్పటికే గెలిచామని, ఈ విధంగా దొరలమయ్యామని, అయితే బిడెన్ వర్గాలు ఎన్నికల తీర్పును తారుమారుచేస్తూ దొంగలయ్యారని ట్రంప్ ట్వీటు చేశారు. అయితే ప్రెసిడెంట్ తరఫున వెలువడ్డ ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని, ఎన్నికలు ఎన్నికల ఫలితాలు లేదా ఎటువంటి ఇతరత్రా పౌర లేదా అధికారిక ప్రక్రియను తప్పుదోవ పట్టించేవిగా ఉంటాయని ట్విట్టర్ నిర్వాహకులు తేల్చిచెప్పారు.

తీవ్రస్థాయి వ్యాఖ్యలకుదిగిన దశలో ఇంతకు ముందు కూడా ట్విట్టర్ యాజమాన్యం ట్రంప్ అకౌంట్‌పై చర్యకు దిగింది. ట్వీట్లను నిలువరించింది. ఫేస్‌బుక్ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ పోస్టుపై ఆక్షేపణలు వెలువరించింది. ఇటువంటివి తగవని పేర్కొంది. పలు రాష్ట్రాలలో ఇప్పటికీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సాగుతున్న దశలో ఇది మరికొద్ది గంటలు రోజుల ప్రక్రియ అయిన పరిస్థితుల్లో ట్రంప్ తమది బిగ్ విన్ అని పేర్కొనడం, వారు తీర్పును కొల్లగొట్టారని వ్యాఖ్యానించడం వంటివి అనుచితం అని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాన్ని ఎవరూ అనధికారికంగా ప్రకటించలేరు. పైగా సౌత్ కరోలినా వీధులలో తమ బ్రహ్మండమైన విజయోత్సవ ప్రదర్శన ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యను కూడా ట్విట్టర్ నిర్వాహకులు హెచ్చరికల నడుమ పోస్టు చేశారు. ఇటువంటి ముందస్తు వ్యాఖ్యలకు దిగవద్దని తెలిపారు.

Twitter and Facebook flag Trump message claiming

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News