Monday, April 29, 2024

రైతుల నిరాహార దీక్షలో పాల్గొనం: బికెయు ఏక్తా ఉగ్రహాన్

- Advertisement -
- Advertisement -

రైతుల నిరాహార దీక్షలో పాల్గొనం
బికెయు ఏక్తా ఉగ్రహాన్

న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలు సోమవారం ఇచ్చిన ఒకరోజు నిరాహార దీక్షకు దూరంగా ఉండాలని గత వారం హక్కుల కార్యకర్తల విడుదల కోరుతూ ప్రదర్శన నిర్వహించిన భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహాన్) నాయకులు నిర్ణయించారు. ఒకరోజు నిరాహార దీక్షలో తాము పాల్గొనబోమని బికెయు ఏక్తా ఉగ్రహాన్ పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. రైతు సంఘాలు ప్రధానంగా పంజాబ్‌కు చెందిన సంఘాలు సోమవారం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేపట్టాయి. అంతేగాక దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని కూడా రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
కాగా..వివిధ నేరారోపణలతో వివిధ జైళ్లలో ఉన్న హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని కోరుతూరుతూ వారి ఫోటోలతో కూడిన పోస్టర్లతో గతవారం టిక్రీ పొలిమేరల్లో జరిగిన నిరసన ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతు సంఘాలను అప్రమత్తం చేశారు. ఈ సంఘ విద్రోహ శక్తులు రైతుల ముసుగులో రైతులు సాగిస్తున్న ఆందోళనను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన హెచ్చరించారు. అయితే సుఖ్‌దేవ్ సింగ్ మాత్రం తాము ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మానవ హక్కుల దినోత్సవం నాడు(గురువారం) జైలులో ఉన్న హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని కోరుతూ ఒక ప్రదర్శన నిర్వహించామని ఆయన చెప్పారు.

We not Supported to Farmers Hunger Strike: BKU

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News