Monday, April 29, 2024

కరోనాతో పోరాడి యువ వైద్యుడు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: కరోనాతో యువ వైద్యుడు మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని బోపాల్ జరిగింది. శుభం ఉపాధ్యాయ్ అనే వైద్యుడు బుంధేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నాడు. గత నెలలో కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవడంతో అవయవ మార్పిడి చేయాలని వైద్య నిపుణులు సూచించారు. ఊపిరితిత్తుల మార్పుకోసం మధ్యప్రదేశ్ నుంచి చెన్నైకి తరలించాలని సూచించారు. నివర్ తుపాన్‌కారణంగా ఆ వైద్యుడిని ప్రభుత్వం తరలించలేకపోయింది. అదే ఆస్పత్రి ఐసియులో చికిత్స పొందుతూ ఆ వైద్యుడు ప్రాణాలు విడిచాడు. మధ్య ప్రదేశ్ లో గత 24 గంటల్లో 1773 కేసులు నమోదుకాగా 14 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 1.98 లక్షలకు చేరుకోగా 3197 మంది ప్రాణాలు విడిచారు. కరోనా వ్యాధి నుంచి 1.81 లక్షల మంది కోలుకోగా 13 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. మధ్య ప్రదేశ్ లో ఇప్పటి వరకు 36 లక్షల మంది కరోనా టెస్టులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News