Monday, April 29, 2024

ఆర్మేనియా క్షిపణి దాడిలో 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

13 killed in Armenian missile strike

 

అజర్‌బైజాన్ ఆరోపణ

బకు(అజర్‌బైజాన్): తమ దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన గంజాపై ఆర్మేనియా సైన్యం జరిపిన క్షిపణి దాడులలో 13 మంది పౌరులు మరణించగా 50 మంది వరకు గాయపడ్డారని అజర్‌బైజాన్ శనివారం ఆరోపించింది. కాగా ఈ ఆరోపణలను ఆర్మేనియా రక్షణ శాఖ ఖండించింది. నగోర్నో-కరాబఖ్‌పై ఆధిపత్యంపై జరుగుతున్న పోరులో భాగంగానే ఈ దాడి జరిగినట్లు అజర్‌బైజాన్ ఆరోపించింది.

శుక్రవారం రాత్రి సోవియట్ తయారీ స్కడ్ క్షిపణితో జరిపిన దాడిలో దాదాపు 20 నివాస భవనలు ధ్వంసమయ్యాయని, క్షతగాత్రులు, మృతుల కోసం రాత్రంతా అత్యవసర కార్యకర్తలు గాలింపులు జరపారని అజర్‌బైజాన్ అధికారులు తెలిపారు. క్షిపణి దాడిని యుద్ధ నేరంగా ప్రకటించిన అజర్‌బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ దీనికి ఆర్మేనియా నాయకత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దీనికి సమాధానం యుద్ధరంగంలో చెబుతామని ఆయన ప్రకటించారు.

నగోర్నో-కరాబఖ్ అజర్‌బైజాన్‌లో భాగమైనప్పటికీ 1994లో యుద్ధం ముగిసినప్పటి నుంచి అల్పసంఖ్యాక వర్గులైన ఆర్మేనియా దళాల అధీనంలోనే ఉన్నాయి. సెప్టెంబర్ 27 నుంచి మళ్లీ తాజాగా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అజర్‌బైజాన్, ఆర్మేనియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం రష్యా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News