Monday, April 29, 2024

ప్రకృతిని కాపాడే బాధ్యత అందరిపై ఉంది

- Advertisement -
- Advertisement -

Adivi sesh who planted Plants

 

మనతెలంగాణ/హైదరాబాద్ : పచ్చని ప్రకృతిని ఆవిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సినిమా హీరో అడవి శేషు విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ అనసూయ చేసిన ఛాలెంజ్‌ను అడవి శేషు స్వీకరించి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు నాటడమే సరైన విధానమని ఆయన అన్నారు. గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగం అడవిశేషు హీరోయిన్ శోభిత ధూళిపాల, డైరెక్టర్ శశి కిరణ్ మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

మొక్కలు నాటడంలో ఆలస్యం వద్దు

మొక్కలు నాటడంలో ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశామని, ఇకముందు ఆలస్యం చేయకుండా మొక్కలు నాటాలని యూట్యూబ్ యాంకర్ దేతడి హారిక విజ్ఞప్తి చేశారు. మొక్కలు ఎంత వేగవంతంగా నాటితే ప్రకృతిని అంత వేగవంతంగా పునరుద్దరించవచ్చని ఆమె అన్నారు. హీరో నవీన్ కుమార్ చేసిన గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించి శుక్రవారం హారిక జూబ్లిహిల్స్‌లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని చెప్పారు. మొక్కల నాటడమేకాదు వాటిని పరిరక్షించే బాధ్యతలను కూడా స్వీకరించాలని ఆమె అన్నారు. యాంకర్ రవి, రేడియో జాకి చైతు, సింగర్ సాకేత్‌కు మొక్కలు నాటాలని హారిక గ్రీన్ ఛాలెంజ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News