Monday, April 29, 2024

వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు ప్రకటించింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్న తరువాత మూడు నెలలకు టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది. కొవిడ్ 19 వ్యాక్సిన్ నిర్వహణ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను బుధవారం వెలువరించింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ విధానంలో చోటుచేసుకున్న మార్పులు ఈ విధంగా ఉన్నాయి.
కొవిడ్‌కు గురైన వారు కోలుకున్న తరువాత మూడు నెలలు వేచి ఉండి తరువాతనే టీకా తీసుకోవాలి. ఇంతకు ముందు ఈ గడువు 4 8 వారాలుగా ఉండేది. ఇప్పుడు 90 రోజులకు పెంచారు. తొలి డోస్ తరువాత కొవిడ్ సోకితే కోలుకున్న తరువాత 3 నెలలకు రెండో డోస్ వేసుకునేలా మార్పు చేశారు. ప్లాస్మా చికిత్స తీసుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తరువాత టీకాలు వేయించుకోవల్సి ఉంటుంది. ఇతర తీవ్రవ్యాధులతో ఆసుపత్రులలో ఉన్నా, ఐసియూల్లో చికిత్స పొందుతున్నా వారు కోలుకున్న తరువాత 4 నుంచి 8 వారాల తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి బాలింతలు వ్యాక్సిన్‌లు వేసుకోవచ్చు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్న వారు 14 రోజుల తరువాత రక్తదానం చేసేందుకు అనుమతి ఉంటుంది. వ్యాక్సినేషన్‌కు ముందు ఎటువంటి రాపిడ్ యాటిజెన్ పరీక్ష అవసరం లేదు.
గర్భిణులకు కొవిడ్ టీకాల వేయవచ్చా? లేదా అనే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ల పద్ధతిలో తాజా మార్పులతో కూడిన నియమావళిని పూర్తిగా, పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.

Central Govt to release new Guidelines on Vaccination

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News