Monday, April 29, 2024

ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

Corona control is everyones Responsibility

 

కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడల పోటీలను వాయిదా వేయడం, సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. సినిమా షూటింగుల్లో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు పనిచేస్తారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగులు వాయిదా వేస్తే మంచిదని చెప్పారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనన్నారని తెలిపారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు.

 

Corona control is everyones Responsibility
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News