Sunday, April 28, 2024

అధికార లాంఛనాలతో అమరవీరునికి అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Funeral of martyred soldier Colonel Santosh Babu today

హైదరాబాద్ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలోని కేసారం కల్నల్ సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 7.45 గంటలకు సంతోష్ బాబు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. సంతోష్‌కు నివాళ అర్పించేందుకు వచ్చే వారు కోవిడ్ 19 నిబంధనలు పాటించాలని సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్‌పి భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఆర్మీ, ప్రభుత్వ, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని, అలాగే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వంచనున్నామని, అంత్యక్రియల్లో ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారని కలెక్టర్, ఎస్‌పి తెలిపారు. కాగా బుధవారం రాత్రి 8 గంటలకు హకీంపేట నుంచి సంతోష్ బాబు పార్థివదేహాన్ని ప్రత్యేక కాన్వాయ్‌లో తరలించారు. ఈ నేపథ్యంలో రాత్రి 10గంటలకు సూర్యాపేటకు చేరుకున్నట్లు అధికారులు వివరించారు. పార్థీవదేహం వెంట సంతోష్ బాబు కుటంబ సభ్యులు ఉన్నారు. కాగా, మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండీ సంతోష్ బాబు పార్థీవదేహాన్ని సూర్యాపేటకు తరలిస్తున్నారు. అలాగే అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నానని తెలిపారు.

అమరుడికి గవర్నర్, మంత్రి కెటిఆర్ అశృనివాళి

భారత సరిహద్దులో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఎఎన్ 32 ఎయిర్ క్రాఫ్ట్‌లో హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు బుధవారం సాయంత్రం తీసుకొచ్చారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఆయన భౌతికకాయానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిజిపి మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, సజ్జనార్‌లతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు నివాళులర్పించారు. ఈక్రమంలో కల్నల్ సంతోష్‌బాబు భార్య, పిల్లలు కూడా ప్రత్యేక వాహనంలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా సంతోష్‌బాబు పార్థివదేహాన్ని ఒఆర్‌ఆర్ మీదుగా సూర్యాపేటకు తరలించారు. ఈనేపథ్యంలో గురువారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబుతో పాటు 20 మందికి పైగా భారత జవాన్లు వీరమరణం చెందారు. వీరికి నివాళులర్పించిన భారత ప్రభుత్వం మృతదేహాలను స్వస్థలాలకు తరలించింది

ప్రత్యేక సైనిక విమానంలో భౌతికకాయం

భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహం హకీంపేట ఎ యిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ప్రత్యేక సైనిక విమానం ద్వారా సం తోష్ బాబు పార్థీవదేహాన్ని హకీంపేటకు తరలించారు. గో ల్కొండ వసతి గృహం నుంచి సంతోష్ బాబు కుటుంబసభ్యు లు ప్రత్యేక కన్వాయ్ వాహనంలో హకీంపేటకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఒఆర్‌ఆర్ మీదుగా రోడ్డు మార్గంలో సంతోష్ పార్థీవదేహాన్ని సూర్యాపేటకు తరలించారు.

అంత్యక్రియల ఏర్పా ట్లను పరిశీలించిన అధికారులు

కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు గురువారం సూర్యాపేట పక్కనే ఉన్న కేసారం గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్‌పి భాస్కరన్, ఆర్మీ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు ఈ అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు.

పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం

సంతోష్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు, స్థానికులు, ప్రజలు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి ఉన్నవారిని మాత్రమే ఆర్మీ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనికి అనుమతించారు.

Funeral of martyred soldier Colonel Santosh Babu today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News