Friday, May 17, 2024

14 రోజుల హోంక్వారంటైన్ ఇకనుంచి 28 రోజులు..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 14 రోజులున్న హోంక్వారంటైన్ ను ఇకనుంచి 28 రోజులకు పెంచింది. ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే కరోనా టెస్టులు చేయాలని, సెంకడరీ కాంటాక్టులకు టెస్టులు చెయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో కొంతమందికి వైరస్ లక్షణాలు 28 రోజుల వరకు బయటపడడంలేదని.. అందువల్ల ఇకనుంచి 14 రోజుల క్వారంటైన్ ను 28 రోజులపాటు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 928 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 23మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ మరింత కఠినం చేసింది. కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలను బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో ఎక్కడిక్కడ నియంత్రిస్తున్నారు.

Home Quarantine Period Extended to 28 days in TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News