Monday, April 29, 2024

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా

- Advertisement -
- Advertisement -

vijaydevarakonda

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ స్టార్ హీరో. ఆదాయంలో కూడా ఇతర యంగ్ హీరోలతో పోల్చితే టాప్‌లో ఉన్నాడు. ఆమధ్య మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా కూడా నిలిచాడు. రౌడీ స్టార్‌గా అభిమానులు పిలుచుకునే విజయ్ దేవరకొండ ప్రస్తుతం కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒకప్పుడు మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “నా జీవితంలో నాన్న నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన వల్లే ఇండస్ట్రీలో అడుగు పెట్టడం సులభమైంది. లాక్ డౌన్ సమయంలో నేను మధ్యతరగతి వారికి సాయం చేసేందుకు ముందుకు రావడం వెనుక ఒక కారణం ఉంది.

నా ఎదుగుదలలో చాలా మంది నాకు తోడ్పాటు అందించారు. నేను సత్యసాయి స్కూల్‌లో చదువుకున్నాను. మా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వారు నాకు ఉచిత విద్యను అందించారు. ఒకానొక సమయంలో చదువుకోసం డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే కొందరు సాయం చేశారు. హీరో అయ్యేందుకు ప్రయత్నించే సమయంలో కూడా తమ్ముడి ఆదాయంపై ఆధారపడ్డాను. ఇప్పుడు నాకంటూ కొంత ఉంది కనుక కొందరికి సాయం చేస్తున్నాను”అని విజయ్‌దేవరకొండ పేర్కొన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

I faced Financial problems
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News