Monday, April 29, 2024

గర్భస్రావం గడువు 24 వారాలకు పెంపు

- Advertisement -
- Advertisement -

Abortion

 

 న్యూఢిల్లీ : గర్భస్రావం చేయడానికి ప్రస్తుత 20 వారాల పరిమితిని ప్రభుత్వం 24 వారాలకు పొడిగించిందని, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. ప్రగతిశీల సంస్కరణలో మహిళలకు పునరుత్పత్తి హక్కులను ఇవ్వడం, గర్భస్రావంకి ప్రస్తుతం 20 వారాలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచారు, అని జవదేకర్ అన్నారు. ఇది గర్భాన్ని సులువుగా తొలగించడంతో పాటు, మహిళలకు వారి శరీరాలపై పునరుత్పత్తి హక్కులను ఇస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (1971) ను సవరించడానికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (సవరణ) బిల్లు (2020) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతామని మంత్రి వివరించారు. ముఖ్యంగా అత్యాచార బాధితులు, మైనర్లు తాము గర్భిణులు అవునో, కాదో అని తెలుసుకునేలోపు ఆ గడువు పూర్తవుతోందని, 24 వారాల గడువు వారికి ఉపయోగపడుతుందని అన్నారు.

Increased Abortion time to 24 weeks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News