Monday, April 29, 2024

ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్.. నేడు చెన్నైతో పోరు

దుబాయి: కిందటి మ్యాచ్‌లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక, తొలి మ్యాచ్‌లో గెలిచిన చెన్నై తర్వాత ఆడిన రెండు పోటీల్లోనూ ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్‌పై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. చెన్నైలో వాట్సన్, డుప్లెసిస్, జడేజా, కేదార్ జాదవ్, విజయ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే నిలకడలేమి చెన్నైకి ప్రధాన సమస్యాగా మారింది. గతంతో పోల్చితే వాట్సన్, విజయ్‌లలో ఆ దూకుడు కనిపించడం లేదు.

ఇక స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా తేలలేదు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. బౌలర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవు తున్నారు. ఇలాంటి స్థితిలో బలమైన హైదరాబాద్‌ను ఓడించడం చెన్నైకి అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. అయితే డుప్లెసిస్ ఫామ్‌లో ఉండడం చెన్నైకి పెద్ద ఊరటనిచ్చే అంశం. అతను చెలరేగితే హైదరాబాద్ బౌలర్లకు సమస్యలు తప్పక పోవచ్చు. విజయ్, వాట్సన్, జడేడా, కరన్ తదితరులు చెలరేగితే చెన్నై గెలుపు అవకాశాలు మెరుగవుతాయనడంలో సందేహం లేదు.
బౌలింగే బలం
మరోవైపు హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపైనే ఆశలు పెట్టుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. కీలక బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ గాడిలో పడడం జట్టుకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మ్యాచ్‌లో కూడా వీరు జట్టుకు కీలకంగా మారారు. నటరాజన్ కూడా కిందటి మ్యాచ్‌లో మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక వార్నర్, విలియమ్సన్, బైర్‌స్టో, మనీష్ పాండే తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IPL 2020: SRH vs CSK Match Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News