Sunday, April 28, 2024

బ్యాంక్ డిపాజిట్లే బెటర్

- Advertisement -
- Advertisement -

deposit in Banks

 

డెబిట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆందోళన
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతమే కారణం
ఈ ఘటన తర్వాత బ్యాంక్ డిపాజిట్లలోకి భారీగా నగదు: బ్యాంక్ వర్గాల వెల్లడి

ముంబై: స్థిరమైన రాబడిని ఇచ్చే డెబిట్ మ్యూచువల్ ఫండ్ల కంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం మేలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికి కారణంగా ఇటీవల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఆరు డెబిట్ ఫండ్లను మూసివేయడమే. ఈ ఉదంతంతో ఇన్వెస్టర్లు డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆందోళన చెందుతున్నారు. దీంతో బ్యాంకుల్లో డిపాజిట్లకే ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. గత ఆదివారం నాడు అమెరికాకు చెందిన మ్యూచువల్ ఫండ్ హౌస్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భారతదేశంలో 6 డెట్ ఫండ్లను మూసివేసింది. ఈ ఘటన తర్వాత నుంచి సంప్రదాయ డిపాజిట్ స్కీమ్‌లలోకి భారీగా నగదు ప్రవాహం వస్తోందని బ్యాంకర్లు ఒక మీడియా సంస్థతో తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్కెట్లో ద్రవ్య కొరత వల్ల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ నిధుల లేమి సమస్యతో సతమతమైంది.

రూ.28 వేల కోట్ల ఆస్తులు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరాయి. ఆ తర్వాత డెబిట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రికార్డు స్థాయిలో ఉపంసహరణలు పెరగ్గా, మరోవైపు సంప్రదాయ బ్యాంక్ డిపాజిట్లకు డిమాండ్ పెరిగింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ సిఇఒ సుమంత్ కాత్‌పలియా మాట్లాడుతూ, కొద్ది రోజులుగా బ్యాంక్ డిపాజిట్లు పెరిగాయని, మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకున్న పెద్ద మొత్తంలో డబ్బు ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చి చేరుతోందని అన్నారు. గత రెండు వారాల్లో బ్యాంక్ డిపాజిట్లు 9.45 శాతం పెరిగాయి. ఇంతకుముందు ఇది 7.93 శాతంగా ఉంది. నగదు ప్రవాహంతో బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గిస్తున్నాయి. టెంపుల్టన్ వార్తల తర్వాత డిపాజిట్లలోకి నగదుపై పూర్తి సమాచారం వచ్చే నెలలో తెలుస్తుందని, అయితే వచ్చే నెలల్లో వృద్ధి రేటు మరింత క్షీణించనుందని ఏజెన్సీలు చెబుతున్నాయని ప్రభుత్వరంగ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకరు తెలిపారు.

ఎంఎఫ్‌లకు అండగా ఆర్‌బిఐ
మ్యూచువల్ ఫండ్స్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్యాపిటల్ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ ద్రవ్యకొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్లను మూసివేసింది. డెబిట్ ఎంఎఫ్‌ల క్లోజింగ్‌కు సంబంధించిన ఒత్తిడి కారణంగా లిక్విడిటీ సమస్య భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలో ద్రవ్య సంక్షోభం తలెత్తకుండా ఉండటానికి ఆర్‌బిఐ సోమవారం మ్యూచువల్ ఫండ్ల కోసం రుణ పథకాన్ని ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్ల కోసం ఆర్‌బిఐ లిక్విడిటీ సౌకర్యం 2020 ఏప్రిల్ 27 నుండి మే 11 వరకు లేదా పూర్తి మొత్తాన్ని ఉపయోగించే వరకు అమలులో ఉంటుంది. కోవిడ్-19 కారణంగా క్యాపిటల్ మార్కెట్లలో అస్థిరత పెరిగిందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

ఆరు ఫండ్ల మూసివేత
కరోనా వైరస్ సంక్షోభం ప్రభావం,, కార్పొరేట్ బాండ్ల మార్కెట్లో పెరిగిన ఉపసంహరణ ఒత్తిడి, క్షీణించిన ద్రవ్యత లభ్యత వల్ల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెబిట్ ఫండ్లను మూసివేయక తప్పలేదు.2020 ఏప్రిల్ 23 నుండి అమలులోకి వచ్చే ఆరు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీమ్‌లను ముగించాలని సంస్థ నిర్ణయించింది. మూసివేసిన ఆ ఆరు ఫండ్స్ విషయానికొస్తే, అవి ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూవల్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్‌కం ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం అపార్చునిటీస్ ఫండ్ ఉన్నాయి. కాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్ల కోసం వాల్యుయేషన్ పాలసీలను సడలించింది. కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఆయా సంస్థలు మెచ్యూరిటీలో పొడిగింపు, లేదా వడ్డీ చెల్లించడంలో ఆలస్యం అయితే వాటిని డిఫాల్టర్స్‌గా ప్రకటించ వద్దని తెలిపింది.

ఈ ఫండ్స్ మూసివేతకు కారణం?
ఈ రుణ నిధులు తక్కువ- రేటెడ్ బాండ్లలో పెట్టుబడి పెట్టాయి. ఇక్కడ ద్రవ్యత ప్రధాన సమస్యగా ఉంది. అధిక రిడెమ్షన్ కారణంగా ఫండ్ బాండ్లను చాలా తక్కువ ధరకు విక్రయించింది. దీనివల్ల ఫండ్ పోర్ట్‌ఫోలియో విలువ పడిపోయింది. ఫండ్ హౌస్ చెల్లించే వరకు పెట్టుబడిదారుల పెట్టుబడి లాక్ అవుతుంది. పెట్టుబడిదారులు తమ డబ్బును తిరిగి పొందుతారు కాని ఇప్పుడు కొంత సమయం పడుతుంది.

 

It is better to cash deposit in Banks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News