Friday, May 24, 2024

ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీతో భారత్‌కు మరో వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -
MRNA Covid-19 vaccines to India
ఫార్మాసంస్థ లుపిన్ ప్రయత్నం

ముంబై : భారత్‌కు ఎంఆర్‌ఎన్‌ఎ కొవిడ్ వ్యాక్సిన్లను తీసుకురావాలనే యోచనలో ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రస్తుతం దాదాపు ఆరు కంపెనీలకు చెందిన ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక కంపెనీతో కలసి పనిచేయాలనుకుంటున్నామని ఈమేరకు భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామని లుపిన్ ఎండి నీలేష్ గుప్తా వెల్లడించారు. అయితే ఈ ఒప్పందం ఎప్పుడు కుదురుతుందో ఆయన చెప్పలేదు. ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నాలజీతో వ్యాక్సిన్లు తయారు చేసే సంస్థల్లో ఫైజర్, మోడెర్నా ముందున్నాయి. ఈ రెండిటిలో ఏదో ఒక సంస్థలో లుపిన్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. దిగుమతుల ద్వారా ఈ వ్యాక్సిన్లను తీసుకురావాలని లుపిన్ భావిస్తోంది. ఇదిలా ఉండగా కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే బాక్రిసిటినిబ్ ఔషధాన్ని వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి తీసుకురాడానికి ఎలీ లిల్లీ సంస్థతో లుపిన్ ఒప్పందం కుదుర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News