Sunday, May 26, 2024

రికార్డు స్థాయిలో ఈ ఏడాది గోధుమల దిగుబడి

- Advertisement -
- Advertisement -

11.4 మిలియన్ టన్నులకు చేరవచ్చని అంచనా

న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉన్న పక్షంలో 2023-24 పంట కాలంలో గోధుమల దిగుబడి రికార్డు స్థాయిలో 11.4 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. రబీ(శీతాకాలం)లో ప్రధాన పంట అయిన గోధుమల నాట్ల చివరి దశ ప్రస్తుతం కొనసాగుతోందని, మరో వారం రోజుల పాటు ఇది కొనసాగుతుందని ఆయన చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం 320.54 లక్షల హెక్టార్లలో వరి నాట్లు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2022-23 పంట కాలంలో(జులై–జూన్) గోధుమల దిగుబడి రికార్డు స్థాయిలో 110.55మిలియన్ టన్నులు ఉందని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 107.7 మిలియన్ టన్నులు అధికమని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సిఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కె మీనా విలేకరులకు తెలిపారు.

ఈ ఏడాది గోధుమల సాగుబడి పూర్తి విస్తీర్ణం ఈ ఏడాది పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేవుడి దయవల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే గోధుమల దిగుబడి 11.4 మిలియన్ టన్నులు ఉండగలదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ తమకు తెలిపిందని ఆయన చెప్పారు. గోధుమల రైతులందరికీ కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గత ఏడాది కన్నా కనీస మద్దతు ధర 7 శాతం పెరగడంతో పెద్ద సంఖ్యలో రైతులు ఎఫ్‌సిఐకి తమ పంటను ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. గత ఏడాది 26.2 మిలియన్ టన్నుల గోధుమలను ఎఫ్‌సిఐ సేకరించింది. ఏప్రిల్ నుంచి గోధుమ పంట కోతలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News