- Advertisement -
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్పొరేటర్లతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం భేటీ అయ్యారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 55 మంది నూతన కార్పొరేటర్లు హాజరైయ్యారు. వారిని మంత్రి కెటిఆర్ అభినందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు పనితీరు, ఇతర అంశాలపై కెటిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మేయర్ ఎంపికపై అవలంభించాల్సిన వైఖరిపై సమావేశంలో చర్చించనున్నారు.
Minister KTR meeting with new corporators
- Advertisement -