Thursday, May 23, 2024

జి 20 సదస్సు.. 6.75 లక్షల పూలకుండీలతో ఢిల్లీ రోడ్ల అలంకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి 20 సదస్సు సందర్భంగా దాదాపు 6.75 లక్షల పూలకుండీలు, దళాలతో ఢిల్లీ నగరం లోని 61 రోడ్లను వేదికలను అందంగా అలంకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్దార్ పటేల్ మార్గ్, మదర్ థెరిస్సా క్రీసెంట్, తీన్ మూర్తి మార్గ్, దౌలా కుయాన్ ఐజిఐ ఎయిర్‌పోర్టు రోడ్, పాలం టెక్నికల్ ఏరియా, ఇండియా గేట్ సిహెక్సాగన్, మండీ హౌస్, అక్బర్ రోడ్, ఢిల్లీ గేట్, రాజ్‌ఘాట్, ఐటిపిఒ తదితర ప్రధాన రోడ్లను పూలకుండీలతో అలంకరిస్తారని రాజ్ నివాస్ అధికారులు తెలిపారు.

లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అధ్యక్షతన సన్నాహక సమావేశం ఆయా ఏజెన్సీలను గుర్తించి మొక్కలను, పూలకుండీలను , తమ నర్సరీల నుంచి సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు అటవీ విభాగం, ఢిల్లీ పార్కులు, గార్డెన్ సొసైటీ, పిడబ్లుడి, డిడిఎ తదితర ఐదు విభాగాలు, ఏజెన్సీలు మొక్కలను సేకరించే కార్యక్రమం చేపట్టాయి. ఇప్పటికే 4.05 లక్షల పూలకుండీలను 61 రోడ్లలో అలరించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News