Thursday, May 23, 2024

సిపిఎస్‌పై కేంద్రం తన వైఖరి మార్చుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఎఐఎఫ్‌టిఒ జాతీయ ఉపాధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని'(సిపిఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఎఐఎఫ్‌టిఒ) ఉపాధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలని కోరారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరుగుతున్న ఎఐఎఫ్‌టిఒ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు.

దేశంలో కొన్ని రాష్ట్రాలు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసినప్పటికీ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వబోమంటూ అనుసరిస్తున్న కేంద్ర వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాల వాటా, ఉద్యోగుల వాటా సొమ్మును తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఈ అంశాలపై జాతీయస్థాయిలో ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎఐఎఫ్‌టిఒ కార్యవర్గ సభ్యులు బి. గీత, త్రివేణిదేవి, రామేశ్వర్ గౌడ్, ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News