Friday, May 24, 2024

కాంగ్రెస్ ఫోన్ బ్యాంకింగ్ స్కామ్.. మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతృత్వం లోని గత యూపీఏ పాలనపై ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిందని, దాంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకనే బ్యాంకులు మళ్లీ కోలుకున్నాయని , ఇప్పుడు ఈ రంగం మరింత బలోపేతమైందని చెప్పారు.

రోజ్‌గార్ మేళాలో భాగంగా శనివారం మరో 70 వేలకు మందికి పైగా మోడీ వర్చువల్‌గా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ ఫోన్ బ్యాంకింగ్ ( బ్యాంకులకు ఫోన్లు చేసి)తో ఆ ప్రభుత్వం రూ.వేల కోట్ల రుణాలను వారికి అనుకూలంగా ఉన్న కొందరు శక్తిమంతమైన నేతలు, కుటుంబాలకు మంజూరు చేయించిందని, ఆ రుణాలు తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత బ్యాంకింగ్ రంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.

బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, చిన్న బ్యాంకులను విలీనం చేయడం, వృత్తి పరమైన నైపుణ్యాలను పెంచడంతో ఈ రంగం కోలుకుందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పుడు బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేస్తున్నాయన్నారు. ముద్రా స్కీమ్ వంటి పథకాలతో పేద, అసంఘటిత రంగ కార్మికులకు రుణాలు అందుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News