Thursday, May 23, 2024

డిజిటల్ క్లాసులకు భారీ స్పందన: చిత్ర రామచంద్రన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిజిటల్ క్లాసులకు భారీ స్పందన వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు. సిలబస్ తగ్గించడం ఉండదని ఎంత మిస్ అయితే అంత హోం అసైన్ మెంట్ ఇస్తామని ఆయన చెప్పారు. స్క్రీన్ టైమ్ ఎంత ఉండాలనేది కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు పాఠాలు మళ్లీ మళ్లీ వినొచ్చన్నారు. వీకెండ్ లో హోంవర్క్ సెషన్స్ ఉంటాయని, వాట్సాప్ గ్రూప్ లలో స్టడీ గ్రూప్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. లక్షా 36వేల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందేలా ఏర్పాటు చేశామని చిత్ర రామచంద్రన్ చెప్పారు. ఇంటర్, డిగ్రీ ఆన్ లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయని, అధిక ఫీజులు వసూల్ చేసే స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Huge response to digital classes: Chitra Ramachandran

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News