Monday, May 13, 2024

అరుదైన ఫీట్

- Advertisement -
- Advertisement -

Samantha received a rare feat on Instagram

 

సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఫీట్ అందుకుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్స్ ఫాలోయర్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ సమంత ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘15 మిలియన్ల బలం ఉంది’ అన్నట్లుగా నోట్ జత చేసింది. ఇక ఈ వీడియోలో సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. తన అభిమానులు చూపిన ప్రేమ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని సామ్ తెలిపింది. ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సామ్ అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News